Earthquake | ఉత్తర కాలిఫోర్నియా ( northern California )లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం (స్థానిక కాలమానం ప్రకారం) 5.5 తీవ్రతతో భూమి కంపించింది. గ్రామీణ హంబోల్ట్ కౌంటీ (Humboldt County)లో సుమారు 1,000 మంది జనాభా కలిగిన పెట్రోలియా (Petrolia)కు పశ్చిమాన 108 కిలోమీటర్ల (67 మైళ్ళు) దూరంలో భూమికి 10 కిలోమీటర్ల (6 మైళ్ళు) లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది. అయితే ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ జరగలేదని పేర్కొంది. ఈ భూకంపం వల్ల ఉత్తర కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు తెలిపింది.
కాగా, కాలిఫోర్నియాలో భూకంపాలు సర్వసాధరణమే. డిసెంబర్లో ఉత్తర కాలిఫోర్నియా తీరానికి 5 కిలోమీటర్ల దూరంలో 6.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 12 మంది గాయపడ్డారు.
Also Read..
Arvind Kejriwal | ఆప్ మేనిఫెస్టోతోనే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం : అరవింద్ కేజ్రీవాల్
ICE Apple | తాటిముంజలతో తక్షణ శక్తి.. చలువతో పాటు ఆరోగ్యానికి మేలు
Delhi | ఢిల్లీలో మండనున్న ఎండలు.. వాతావరణ శాఖ హెచ్చరిక