వాషింగ్టన్: హమాస్ మారణహోమం సృష్టిస్తోంది. వేలాది మంది ఇజ్రాయిల్ ప్రజల్ని చంపేస్తోంది. కిబుజిమ్లో హమాస్ ఫైటర్లు బీభత్సం సృష్టించారు. మహిళలు, చిన్నారులు, పసిపిల్లలు, వృద్ధుల్ని అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల తరహాలో హమాస్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. కిబుజిమ్లో సుమారు 40 మంది చిన్నారుల్ని హమాస్ నరికివేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు(IDF) పేర్కొన్నాయి. పసి పిల్లలను చంపేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, హమాస్ ఇలాంటి దాడులకు పాల్పడుతుందని తొలుత నమ్మలేదని, కానీ సాక్ష్యులు చెబుతున్న విషయాలు భయానకంగా ఉన్నట్లు ఐడీఎఫ్ ప్రతినిధి జోనాథన్ కన్రికస్ తెలిపారు. మహిళలు, చిన్నారుల చేతులకు సంకెళ్లు వేసి నరికివేస్తున్నారని ఆయన అన్నారు. హమాస్ క్రూరత్వానికి ప్రపంచానికి చూపేందుకు.. కిబుజిమ్ ప్రాంతానికి అంతర్జాతీయ జర్నలిస్టులను తీసుకువెళ్లారు.
40 babies murdered. pic.twitter.com/70rpzI8isP
— Israel ישראל 🇮🇱 (@Israel) October 10, 2023