అమెరికాలో మరోసారి కాల్పులు.. దుండగుడు సహా నలుగురు మృతి
Indiana | అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇండియానా (Indiana) స్టేట్లోని ఓ మాల్లో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇండియానా (Indiana) స్టేట్లోని ఓ మాల్లో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం ఇండియానాలోని గ్రీన్ఉడ్ పార్క్ మాల్లో ఉన్న ఫుడ్కోర్టులోకి చొరబడిన ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారని పోలీసులు తెలిపారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామని వెల్లడించారు. కాగా, ఓ పౌరుడు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడని చెప్పారు.

కాగా, అమెరికాలో కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం సర్వ సాధారణమైంది. ఏడాది కాలంలో సుమారు 40 వేల మందికిపైగా తుపాకీ కాల్పుల్లో మృతిచెందారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 4న చికాగో సబ్అర్బ్లో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో మరో రెండు డజన్ల మంది గాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

