వాషింగ్టన్: వినూత్నంగా ఆలోచించాలే గాని గిన్నిస్ రికార్డును సాధించడం సులువేనని నిరూపించాడు అమెరికాకు చెందిన ఒక సినీ ప్రియుడు. యూఎస్‌లోని పెన్సిల్వేనియాకు చెందిన 32 ఏండ్ల జాక్ స్వోప్ ఒక ఏడాదిలో 777 సినిమాలు తిలకించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. జూలై 2022 నుంచి జూలై 2023 వరకు 777 సినిమాలను వీక్షించిన స్వోప్ గతంలో ఫ్రాన్స్‌కు చెందిన విన్సెంట్ క్రోహ్న్ 2018లో స్థాపించిన 715 చిత్రాల రికార్డును బద్ధలు కొట్టాడు. అయితే ఈ చిత్రాలను చూడటానికి నిర్వాహకులు కొన్ని నిబంధనలు విధించారు. ప్రతి చిత్రాన్ని పూర్తిగా వీక్షించాలి. మధ్యలో ఫోన్ వాడటం, కునుకు తీయడం చేయరాదు.