Pythons: పైథాన్ బ్రీడర్ను పట్టించిన కరెంటు బిల్లు.. 300కు పైగా కొండచిలువలు స్వాధీనం
Pythons: చైనాలో ఓ వ్యక్తి ఇంటికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. దీంతో అనుమానం వచ్చి ఆ ఇంట్లోకి అధికారులు వెళ్లారు. వాళ్లు షాక్ అయ్యారు. ఇంటి నిండా పైథాన్ సర్పాలున్నాయి. వాటి బ్రీడింగ్ కోసం కరెంటు వాడినట్లు గుర్తించారు. ఆ ఇంటి నుంచి సుమారు 309 సర్పాలను రెస్క్యూ చేశారు.
బీజింగ్: చైనాలో ఓ వ్యక్తి ఇంటి నుంచి సుమారు 300కుపైగా కొండచిలువల(Pythons)ను స్వాధీనం చేసుకున్నారు. అతను పైథాన్ సర్పాలను బ్రీడింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ ఘటనకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి. జీజియాంగ్ ప్రావిన్సులో ఉన్న తైజావూ లో పోలీసులు ఓ ఇంటిని రెయిడ్ చేశారు. ఆ ఇంట్లో వాళ్లకు 309 పైథాన్ సర్పాలు చిక్కాయి. ప్లాస్టిక్ బాటిళ్లలో వాటిని అన్ని రూముల్లో పెట్టాడతను. అయితే ఆ ఇంటికి సమీపంలో ఉన్న ఓ కొండల్లో తొలుత ఓ వ్యక్తి అరుదైన కొండచిలువ సర్పాన్ని గుర్తించాడు. దీంతో ఆ విషయాన్ని అతను స్థానిక అధికారులకు తెలియజేశాడు. అయితే అరుదైన ఆ జాతి సర్పాలను చైనా చట్టాల ప్రకారం నిషేధిస్తారు. కానీ ఆ పైథాన్ సర్పం కనబడడం వల్ల.. సరీసృపాల నిపుణులు దాని గురించి ఆరా తీశారు. ఎవరో ఒకరు ఆ ప్రాంతంలో వాటిని పెంచుతున్నట్లు అనుమానించారు. ఇక పైథాన్ నిపుణుల ప్రకారం ఆ వ్యక్తి కోసం వేట కొనసాగించారు.
కొండచిలువ సర్పాలను బ్రీడింగ్ చేయాలంటే కనీసం 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత కావాల్సి ఉంటుంది. అయితే ఆ టిప్ సాయంతో ఆ సర్పాలను పెంచి పోషిస్తున్న వ్యక్తిని పట్టేశారు. ఆ ప్రాంతంలో విద్యుత్తు బిల్లు అధికంగా వస్తున్న వ్యక్తి ఇంటిపై నిఘా పెట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంటికి వెళ్లిన అధికారులు షాక్ తిన్నారు. ఆ వ్యక్తి పేరు గువో. అతను అవివాహితుడు. ఒంటరిగా ఇంట్లో ఉంటున్న అతను.. సుమారు 309 పైథాన్ పాములను బ్రీడింగ్ చేశాడు.
2014లో నాలుగు పాములను తెచ్చిన అతను.. బ్రీడింగ్ చేస్తూ వాటిని ఆన్లైన్ ద్వారా అమ్ముతున్నాడు. గువోతో పాటు మరో ఇద్దర్నీ ఈ కేసులో అరెస్టు చేశారు. సుమారు 30 మిలియన్ల యువాన్ల ఖరీదైన 436 కొండచిలువ పాములను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చైనా చట్టాల ప్రకారం ఒకవేళ నిషేధ సర్పాన్ని అమ్మినా, బ్రీడింగ్ చేసినా వారికి అయిదేళ్ల జైలుశిక్ష విధిస్తారు. రెస్క్యూ చేసిన పాములను స్థానిక జూకు తరలించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

