పాకిస్థాన్ మసీదుపై సూసైడ్ అటాక్.. 30 మంది మృతి
పెషావర్: పాకిస్థాన్‌లో ఇవాళ భీకర పేలుడు ఘటన నమోదైంది. పెషావర్‌లోని ఓ మసీదులో జరిగిన పేలుడులో 30 మంది మరణించినట్లు తెలుస్తోంది. సూసైడ్ అటాక్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. లేడీ రీడింగ్ హాస్పిటల్‌కు చెందిన అధికారులు మృతదేహాలను గుర్తిస్తున్నారు. ఈ ఘటనలో మరో 50 మంది గాయపడినట్లు తెలతుస్తోంది. పెషావర్ సిటీ పోలీసు ఆఫీసర్ ఇజాజ్ అషాన్ మాట్లాడుతూ తాజా పేలుడులో ఓ పోలీసు అధికారి మృతిచెందినట్లు చెప్పారు. 30 మృతదేహాలను హాస్పిటల్‌కు తీసుకువచ్చినట్లు లేడీ రీడింగ్ హాస్పిటల్ మేనేజర్ అసిమ్ ఖాన్ తెలిపారు.
నగరంలోని కిస్సా ఖవాని బజార్లో ఉన్న మసీదులోకి ఇద్దరు సాయుధులు చొరబడే ప్రయత్నం చేశారు. అక్కడ భద్రత కల్పిస్తున్న పోలీసులపై తొలుత వాళ్లు ఫైరింగ్ జరిపారు. ఆ ఘటనలో ఓ పోలీసు మృతిచెందగా, మరో పోలీసు గాయపడ్డాడు. కిస్సా ఖవాని బజారులో చాలా షాపులు ఉంటాయి. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఆ ప్రాంతం అంతా రద్దీగా ఉంటుంది. లేడీ రీడింగ్ హాస్పిటల్ వద్ద ప్రస్తుతం అలర్ట్ ప్రకటించారు.
మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. గాయపడ్డ వారికి చికిత్స ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. సంబంధిత అధికారుల నుంచి పేలుడు ఘటనకు చెందిన నివేదికను ఆయన కోరారు. వాస్తవానికి ఇవాళ రావాల్పిండిలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు రావాల్పిండి వెళ్లాల్సి ఉంది. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

