Mosque Blast | పాకిస్థాన్లోని పెషావర్లో గల ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. భద్రతా సిబ్బందే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఇప్పటి వరకు వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరవకముందే ఆఫ్ఘానిస్థాన్ (Afghanistan)లో మరో ఘటన చోటు చేసుకుంది.
ఆఫ్ఘాన్లోని ఓ మసీదు వద్ద బుధవారం పేలుడు సంభవించింది. ఫర్యాబ్ ప్రావిన్స్ (Faryab province)లోని ఇమామ్ అబు హనీఫా మసీదు(Imam Abu Hanifa mosque) సమీపంలో పార్క్ చేసిన ఓ బైక్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.