Suspected Terrorists: 22 మంది అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
Suspected Terrorists: 22 మంది అనుమానిత ఉగ్రవాదులను పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో అరెస్టు చేశారు. ఆ ఉగ్రవాదులు ఐఎస్ఐఎస్, టీటీపీతో పాటు ఇతర నిషేధిత సంస్థలకు చెందినట్లు గుర్తించారు.ఉగ్రవాదుల నుంచి 1645 గ్రామాలు పేలుడు పదార్థాలు, మూడు హ్యాండ్ గ్రానేడ్లు, ఒక ఐఈడీ బాంబు, 12 డెటోనేటర్లు, పిస్తోల్, నిషేధిత సాహిత్యాన్ని సీజ్ చేశారు.
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుకు చెందిన పోలీసులు భారీ కుట్రను భగ్నం చేశారు. సుమారు 22 మంది అనుమానిత ఉగ్రవాదుల(Suspected Terrorists)ను అరెస్టు చేశారు. ఆ ఉగ్రవాదులు ఐఎస్ఐఎస్, టీటీపీతో పాటు ఇతర నిషేధిత సంస్థలకు చెందినట్లు గుర్తించారు. కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ శాఖ ఇచ్చిన సమాచారం ఆధారంగా పంజాబ్‌లోని వేర్వేరు జిల్లాల్లో సుమారు 152 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించామని, ఐఎస్ఐఎస్, తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, లష్కరే ఈ జాంగ్వీ గ్రూపులకు చెందిన 22 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
లాహోర్, అటాక్, షేక్‌పురా, ముజాఫర్ఘర్, నాన్కానా సాహిబ్, బవల్పుర్, డీజీ ఖాన్, ఫైసలాబాద్, ముల్తాన్, భవాల్నగర్, రావల్పిండి నుంచి వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల వద్ద నుంచి 1645 గ్రామాలు పేలుడు పదార్థాలు, మూడు హ్యాండ్ గ్రానేడ్లు, ఒక ఐఈడీ బాంబు, 12 డెటోనేటర్లు, పిస్తోల్, నిషేధిత సాహిత్యాన్ని సీజ్ చేశారు. అనుమానిత ఉగ్రవాదులు పంజాబ్‌లో అఘాయిత్యానికి ప్లాన్ వేశారు, రాష్ట్రంలో ఉన్న కీలక ప్రదేశాలను, వ్యక్తులను టార్గెట్ చేయాలని భావించారు.
ఉగ్రవాదులుపై 18 కేసులు బుక్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ నిమిత్తం ఆ ఉగ్రవాదులను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

