బలూచిస్థాన్‌లో రోడ్డు ఘోర ప్రమాదం.. 22 మంది దుర్మరణం
బలూచిస్తాన్ : పాక్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ వ్యాన్ వంద అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది దుర్మరణం పాలయ్యారు. జోబ్ నేషనల్ హైవేపై ఖిల్లా సైఫుల్లాకు సమీపంలో ప్రమాదం జరిగినట్లు పాక్ పత్రిక డాన్ పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 23 మంది ఉన్నారని, ఇందులో 22 మంది మరణించినట్లు పేర్కొంది.
ఓ చిన్నారి తీవ్రంగా గాయపడి, ప్రాణాలతో బయటపడ్డట్లు పేర్కొంది. బుధవారం ఉదయం 23 మందితో వ్యాన్ జోబ్‌కు వెళ్తున్న సమయంలో.. అక్తర్ జాయ్ సమీపంలో కొండపై నుంచి వ్యాన్‌లో లోయలో పడిపోయిందని జిల్లా డిప్యూటీ కమిషనర్ హఫీజ్ ముహమ్మద్ ఖాసిం తెలిపారు. ప్రమాదంలో బాలుడు గాయపడ్డారని, చికిత్స కోసం క్వెట్టాకు తరలించినట్లు చెప్పారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు, 11 మంది వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో విచారం వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

