వేలంలో 22 కోట్లు పలికిన స్పేస్జాకెట్
వాషింగ్టన్, జూలై 27: 1969లో నీల్ఆర్మ్స్ట్రాంగ్తో కలిసి చంద్రుడిపై అడుగుపెట్టిన సమయంలో వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ వేసుకున్న స్పేస్ జాకెట్ మంగళవారం జరిగిన వేలంలో రికార్డు ధర పలికింది. న్యూయార్క్‌లో జరిగిన వేలంలో ఈ జాకెట్ 28 లక్షల డాలర్ల(దాదాపు రూ.22.3 కోట్లు)కు అమ్ముడుపోయిందని వేలం నిర్వహణ సంస్థ సోత్బే పేర్కొన్నది.
ఈ స్పేస్ ఫ్లైట్ జాకెట్ ముందు భాగంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా లోగోతోపాటు అపోలో-11 మిషన్ చిహ్నం, దానికి కొద్దిగా పైన ఆల్డ్రిన్ నేమ్ ట్యాగ్ ఉన్నాయి. దాని ఎడమ భుజంపై అమెరికా జెండా కూడా ఉన్నది. ప్రస్తుతం బజ్ ఆల్డ్రిన్ వయసు 92 ఏండ్లు. 1969లో చేపట్టిన చరిత్రాత్మక మిషన్ అపోలో-11 ద్వారా చంద్రుడిపైకి వెళ్లిన ముగ్గురిలో ప్రస్తుతం జీవించి ఉన్నది ఈయన ఒక్కరే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

