ఈజిప్ట్‌లో బయటపడిన 2000 ఏండ్ల నాటి పురాతన విగ్రహం
ఈజిప్ట్‌లో పురావస్తు శాస్త్రవేత్తలు 2000 ఏండ్ల నాటి సింహిక విగ్రహాన్ని కనుగొన్నారు. దక్షిణ ఈజిప్ట్‌లోని క్వెనా ప్రావిన్స్‌కు చెందిన దెనెంద్ర ఆలయ ప్రాంగణంలో జరిపిన తవ్వకాల్లో నవ్వుతున్న సింహిక విగ్రహం పురావస్తు శాస్త్రవేత్తల కంటపడింది.
కైరో : ఈజిప్ట్‌లో పురావస్తు శాస్త్రవేత్తలు 2000 ఏండ్ల నాటి సింహిక విగ్రహాన్ని కనుగొన్నారు. దక్షిణ ఈజిప్ట్‌లోని క్వెనా ప్రావిన్స్‌కు చెందిన దెనెంద్ర ఆలయ ప్రాంగణంలో జరిపిన తవ్వకాల్లో నవ్వుతున్న సింహిక విగ్రహం పురావస్తు శాస్త్రవేత్తల కంటపడింది. ఇది ఆలయంలోని రెండంచెల సమాధి లోపల మందిరాన్ని తవ్వుతుండగా దాని అవశేషాల నుండి బయటపడింది. రోమన్ శకానికి చెందిన విగ్రహంగా దీన్ని భావిస్తున్నారు. సున్నపురాయితో తయారు చేయబడిన ఈ కళాఖండం పురాతన రోమన్ చక్రవర్తి శైలికి ప్రతిరూపంగా పురావస్తు శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.
అయితే ఇది గిజా పిరమిడ్స్లోని సింహికతో పోలిస్తే చాలా చిన్నది కావడం గమనార్హం. 41 నుండి 54 ఏడీ వరకు రోమ్ను పాలించిన క్లాడియస్ చక్రవర్తి పోలికలో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ ఫేస్బుక్ ఖాతాలో ఈ విగ్రహం ఫొటోలను షేర్ చేశారు. క్వెనాలోని దెనేంద్ర ఆలయంలో జరిపిన తవ్వకాల్లో సింహిక రూపంలో రోమన్ చక్రవర్తుల కాలానికి చెందిన విగ్రహం బయటపడిందని ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఇక పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం రోమన్ కాలం నాటి ప్రార్థనా మందిరం, సున్నపురాయి టేబుల్ అవశేషాలను కూడా కనుగొందని ఫేస్బుక్ పోస్ట్ పేర్కొంది. కైరోలోని ఐన్ షామ్స్ యూనివర్సిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ తవ్వకాలను చేపట్టింది. ఈజిప్ట్‌లోని గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజాలో హిడెన్ కారిడార్ బయటపడిన నేపధ్యంలో తాజాగా 2000 ఏండ్ల నాటి పురాతన విగ్రహాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.
Read More :
Michelle Obama | ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత అరగంట ఏడ్చానన్న మిచెల్ ఒబామా.. ఎందుకో తెలుసా..?
Molestation Case: సింగపూర్‌లో భారతీయ వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసు
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- buzz
- Egypt
- Sphinx statue
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

