Russia | పట్టాలు తప్పి నదిలో పడిపోయిన రైలు బోగీలు.. 70 మందికి గాయాలు
Russia | రష్యా (Russia)లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఫార్ నార్త్‌లో ఓ ప్యాసింజర్ రైలు (Passenger Train Crash) పట్టాలు తప్పి నదిలో పడిపోయింది.
Russia | రష్యా (Russia)లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఫార్ నార్త్‌లో ఓ ప్యాసింజర్ రైలు (Passenger Train Crash) పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 70 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. రైలు వోర్కుటా నగరం నుంచి ఆర్కిటిక్ సర్కిల్ మీదుగా.. దేశంలోని దక్షిణాన నల్ల సముద్రంలోని నోవోరోసిస్క్ (Novorossiysk) నౌకాశ్రయానికి వెళ్తోంది. కోమి రిపబ్లిక్‌లోని ఇంటా అనే చిన్న పట్టణం సమీపంలోకి రాగానే రైలు పట్టాలు తప్పింది. దీంతో తొమ్మిది బోగీలు కోమి నదిలోకి పడిపోయాయి. ఆ సమయంలో ట్రైన్లో 215 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 70 మంది గాయపడినట్లు తెలిసింది. క్షతగాత్రుల్లో ఏడుగురికి తీవ్రమైన గాయాలైనట్లు స్థానిక మీడియా నివేదించింది.
అయితే, ప్రమాద సమయంలో నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొంది. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కోమి (Komi) రీజియన్‌లో ఇటీవలే కురిసిన వర్షాలకు సంభవించిన వరదల కారణంగా రైలు పట్టాలు దెబ్బతిన్నాయని తెలిపింది. తాజా ప్రమాదానికి కారణమిదేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు రష్యా మీడియా నివేదించింది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Passenger train derails in northwestern Russia, leaving 70 injured@KremlinRussia_E #Russia #RussiaTrain #TrainAccident #northwestern #Komi #RIAnewsagency pic.twitter.com/BlIyOqAQJh
— ANAND SHUKLA (@anandshlive) June 26, 2024
Also Read..
Kallakurichi | కల్తీసారా ఘటనలో 63కు పెరిగిన మృతులు.. సీబీఐ విచారణకు అన్నాడీఎంకే డిమాండ్
President Murmu: రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

