Droupadi Murmu | పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యం.. నీట్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు : ద్రౌపది ముర్ము
Droupadi Murmu | ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) తెలిపారు.
Droupadi Murmu | ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) తెలిపారు. జమ్మూకశ్మీర్‌పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో కశ్మీర్ లోయలో మార్పు కనిపించిందని పేర్కొన్నారు. శత్రువుల కుట్రలకు అక్కడి ప్రజలు గట్టిగా బదులిచ్చారన్నారు. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం అన్నారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.
‘రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ (సంస్కరణలు, పనితీరు, మార్పు) ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. గత పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైంది. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోంది. పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. మహిళల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. పౌరవిమానాయాన రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ఆర్థిక భరోసా కోసం నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మెట్రో సేవలు విస్తరించాం’ అని ముర్ము తన ప్రసంగంలో వివరించారు.
రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలివే..
- పేదల నిర్మూలనపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. పేదల ఆర్థిక శక్తి పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గరీబ్ కల్యాణ్ యెజన కింద పేదలకు ఉచితంగా రేషన్ సరఫరా.
- ఆరోగ్య రంగంలో భారత్ అగ్రగామిగా ఉంది. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు. ఆయుష్మాన్ భారత్ అనేది గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోంది.
- వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. అన్ని రంగాల్లో భారత్ బలంగా విస్తరిస్తోంది. ఉద్యోగాల కల్పనలోనూ ప్రభుత్వం కృషి చేస్తోంది. సర్వీస్ సెక్టార్లను కూడా ప్రభుత్వం బలపరుస్తోంది.
- రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. పంటలకు మద్దతు ధర కల్పించే విషయంలో కట్టుబడి ఉన్నాం. చిన్న, సన్నకారు రైతుల కోసం పీఎం సమ్మాన్ నిధి ఇస్తున్నాం. ఈ నిధి కింద రూ.3.20 లక్షల కోట్లకు ఇచ్చాం. ఆర్థిక భరోసా కోసం నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సహిస్తున్నాం.
- పీఎం గ్రామీణ్ సడక్ యోజనలో 3.8లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించాం. వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాం. పదేళ్లలో మెట్రో రైళ్లను 21 నగరాలకు విస్తరించాం. తొలిసారి అంతర్జాతీయ రైలు మార్గానికి పునాది వేశాం.
- కరోనా వంటి కష్టకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం. ప్రజల నమ్మకానికి తగ్గట్టే మా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది.
- సైనిక దళాల్లో స్థిరమైన సంస్కరణలు రావాలి. సైనిక దళాలు స్వయం సమృద్ధి సాధించాయి. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేశాం. సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పింఛను అమలు చేశాం. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి.
- ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పారదర్శకత ఉండాలి. పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతోంది. నీట్ తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. నీట్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యం. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
Also Read..
Mahesh Chandra Laddha | ఆంధ్రప్రదేశ్ సర్వీసుల్లోకి సీఆర్పీఎఫ్ ఐజీ మహేశ్ చంద్ర లడ్డ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్‌లో ఓ రైతు ఆవేదన
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

