President Murmu: రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
President Droupadi Murmu: పార్లమెంట్లో ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ అని ఆమె పేర్కొన్నారు. భారత రాజ్యాంగంపై అదో మచ్చలా మిగిలిపోయిందన్నారు.
న్యూఢిల్లీ: దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( President Murmu) కామెంట్ చేశారు. ఉభయసభలను ఉద్దేశించి ఆమె ఇవాళ పార్లమెంట్లో మాట్లాడారు. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ అని ఆమె అన్నారు. భారత రాజ్యాంగంపై అదో మచ్చలా మిగిలిపోయిందన్నారు. ఇదే అంశాన్ని ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ కూడా అన్నారు. ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగంపై దాడి చేశారని ధంకర్ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విషయంలో బీజేపీ, విపక్షాల మధ్య చాన్నాళ్లుగా వాగ్వాదం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఎమర్జెన్సీ విధించడం వల్ల దేశంలో ఎటువంటి అనర్థాలు జరిగాయో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు ఇటీవల ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు దేశంలో గత పదేళ్ల నుంచి అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. భారత్‌ను అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. అన్ని రంగాల్లో భారత్ శరవేగంగా ఆత్మనిర్భర్ దిశగా వృద్ధి చెందుతోందన్నారు. పేపర్ లీకేజీ లాంటి విషయాల్లో దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

