మెక్సికో జైలుపై దుండగుల దాడి.. 14 మంది మృతి
Mexico | మెక్సికోలోని ఓ జైలుపై దుండగులు దాడికి పాల్పడ్డారు. వారు జరిపిన కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. మెక్సికో సరిహద్దు నగరమైన జువారెజ్‌లో ఉన్న సెంట్రల్ జైలుపై సాయుధులైన గుర్తుతెలియని
న్యూఢిల్లీ: మెక్సికోలోని ఓ జైలుపై దుండగులు దాడికి పాల్పడ్డారు. వారు జరిపిన కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. మెక్సికో సరిహద్దు నగరమైన జువారెజ్‌లో ఉన్న సెంట్రల్ జైలుపై సాయుధులైన గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు. విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 14 మంది అక్కడికక్కడే మరణించారు. వారిలో 10 మంది భద్రతా సిబ్బంది, నలుగురు ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు.
ఎస్‌యూవీల్లో వచ్చిన దుండగులు ఒక్కసారిగా జైలు సెక్కూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారని, జైలులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారని అధికారులు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం, స్థానిక పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని చెప్పారు. అయితే దుండగుల కాల్పుల్లో భద్రతా సిబ్బందితోపాటు నలుగురు ఖైదీలు చనిపోయారని, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా 24 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నట్లు గుర్తించామన్నారు. ఈ దాడికి పాల్పడింది ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోను ఉందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- armed men
- Attack
- Juarez city
- Mexico
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

