మిజోరాంలోకి భారీగా మయన్మార్ శరణార్థులు
Myanmar | పొరుగున ఉన్న మయన్మార్ నుంచి మిజోరాంకు శరణార్థులు పోటెత్తుతున్నారు. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న చిన్ రాష్ట్రంలోని గ్రామాలపై ఆ దేశ

న్యూఢిల్లీ: పొరుగున ఉన్న మయన్మార్ నుంచి మిజోరాంకు శరణార్థులు పోటెత్తుతున్నారు. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న చిన్ రాష్ట్రంలోని గ్రామాలపై ఆ దేశ సైన్యం గత కొంతకాలంగా గుండ్ల వర్షం కురిపిస్తున్నది. దీంతో బతుకు జీవుడా అంటూ అక్కడి ప్రజలు ఊర్లను ఖాళీ చేస్తున్నారు. కొండలు, గుట్టలు, వాగులు వంకలు, నదులను దాటుతూ మిజోరాంలోకి ప్రవేశిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 12,121 మంది శరణార్థులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారని మిజోరాం హోం మంత్రి లాల్చామలియనా వెల్లడించారు.
ఒక్క నహ్థియాల్ జిల్లాలోనే చిన్ రాష్ట్రానికి చెందిన రెండు వేల మంది ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. గత నెలలో మిజోరాం-మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలపై మయన్మార్ సైన్యం విమానాల ద్వారా దాడులకు పాల్పడింది. దీంతో మయన్మార్ శరణార్థులు నదిని దాటి, కొండ ప్రాంతాలను దాటుకుని మిజోరాంలోకి ప్రవేశించారని అధికారులు తెలిపారు.
మిజోరాంలోని చంపాయ్, సియాహా, లవగ్లాయ్, సెర్చిప్, నహ్థియాల్, సైతుయాల్ జిల్లాలు మయన్మార్తో సుమారు 510 కిలోమీటర్ల మేర సరిహద్దును కలిగి ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

