Britain | అక్రమ వలసలపై బ్రిటన్ ఉక్కుపాదం.. వీసా సోదాల్లో 12 మంది భారతీయుల అరెస్ట్
బ్రిటన్‌లోని పరుపులు, కేక్ పరిశ్రమల్లో అక్రమంగా పనిచేస్తున్న 12 మంది భారతీయులను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో వీరిని అరెస్ట్ చేసినట్టు యూకే హోం శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Britain | లండన్, ఏప్రిల్ 11: బ్రిటన్‌లోని పరుపులు, కేక్ పరిశ్రమల్లో అక్రమంగా పనిచేస్తున్న 12 మంది భారతీయులను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో వీరిని అరెస్ట్ చేసినట్టు యూకే హోం శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘కేక్ ఫ్యాక్టరీలో అరెస్టయిన నలుగురు భారతీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించారు. మొత్తం నిందితుల్లో నలుగురిని దేశం నుంచి బహిష్కరించడమా లేదా ఇండియాకు తిప్పి పంపడమా అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
మిగతా 8 మందికి క్రమం తప్పకుండా హోం శాఖ ఆఫీసులో రిపోర్ట్ చేయాలనే నిబంధన మీద బెయిల్ ఇచ్చాం’ అని హోం శాఖ తెలిపింది. భారతీయులతో అక్రమంగా పని చేయించుకుంటున్న ఫ్యాక్టరీలకు జరిమానాలు విధిస్తామని అధికారులు తెలిపారు. చట్ట విరుద్ధంగా పని చేయడం స్థానిక సమాజాలకు హాని కలిగిస్తుందని.. తాజా అరెస్టులు ఫ్యాక్టరీ యజమానులకు హెచ్చరికలు పంపుతాయని అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులను అరికట్టాలని సునాక్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో విదేశీయులకు వీసా నిబంధనలు సైతం కఠినతరం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

