బీజింగ్: చైనాలోని (China) హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లో (Heilongjiang Province) ఘోర ప్రమాదం జరిగింది. క్వికిహార్‌లోని (Qiqihar) ఓ మిడిల్ స్కూల్లో (Middle School) జిమ్ పైకప్పు (Gym Roof) ఒక్కసారిగా కూలిపోయింది (Collaps). దీంతో పది మంది మరణించారు. శిథిలాల (Wreckage) కింద మరొకరు చిక్కుకుపోయారు. ఆదివారం సాయంత్రం 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నదని అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం 5:30 గంటల వరకు శిథిలాల నుంచి 14 మందిని బయటకు తీశామన్నారు. నలుగురి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులకు చికిత్స చేస్తుండగా ఆరుగురు మరణించారు.
39 ఫైర్ ట్రక్కులు, 160 మంది ఫైర్‌ఫైటర్లు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని వెల్లడించారు. జిమ్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భారీవర్షాల వల్ల జిమ్ పైకప్పు కూలిందని చెప్పారు.