అందమైన క్రియేటర్స్.. వేలల్లో ఫాలోవర్స్
నగర అందాలను నెటిజన్లు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. రీల్స్ తీస్తూ.. ప్రశంసలు అందుకుంటూ.. ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. సెకన్ల నిడివిగల వీడియోలు తీస్తూ..ఎఫెక్ట్స్ అద్దుతూ సెలబ్రెటీలు అవుతున్నారు. అంతేకాదు వేలాది వీడియోలతో ఇన్ఫ్లుయెన్సర్లుగా కూడా మారిపోతున్నారు.
- సోషల్ మీడియాలో రీల్స్‌తో కేక పుట్టిస్తున్న యువత
- ఆకర్షణీయమైన ప్రదేశాల్లో షూట్.. ఫిదా అవుతున్న నెటిజన్లు
సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): నగర అందాలను నెటిజన్లు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. రీల్స్ తీస్తూ.. ప్రశంసలు అందుకుంటూ.. ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. సెకన్ల నిడివిగల వీడియోలు తీస్తూ..ఎఫెక్ట్స్ అద్దుతూ సెలబ్రెటీలు అవుతున్నారు. అంతేకాదు వేలాది వీడియోలతో ఇన్ఫ్లుయెన్సర్లుగా కూడా మారిపోతున్నారు.

ఇన్‌స్టాలో పోస్ట్ చేసి..
ట్యాంక్‌బండ్, ఇందిరాపార్క్, చార్మినార్, గోల్కొండ, ఐటీ ప్రాంతాలు, శిల్పారామం, లేక్‌లు, టూంబ్స్ ఇలా ఎన్నో ప్రదేశాలను వేదికలుగా మలుచుకుని షార్ట్‌ఫిల్మ్‌లు, రీల్స్ తీస్తూ ఫాలోవర్స్‌ను సంపాదించుకుంటున్నారు విద్యార్థులు తరుణ్ పైల్వాన్, గౌతమ్ రాజ్, నానిలు. ఇందిరాపార్క్‌లో కొత్త కొత్త లొకేషన్స్‌ను సృష్టించుకుని సుమారు మూడు వందలకు పైగా రీల్స్ చేశారు. ఇన్‌స్టాలో పోస్ట్ చేసి.. నెటిజన్లను మెప్పిస్తున్నారు.
300లకు పైగా..
ఇందిరాపార్క్‌లో 300లకు పైగా వీడియోలు చేశాం. ఒకదానికి ఒకటి సంబంధం లేని విధంగా రీల్స్ రూపొందించాం. అన్నీ ఇక్కడే చేశామని మా ఫాలోవర్స్ గుర్తించడం కష్టం. అంతలా ఇక్కడ విభిన్న రకాల లొకేషన్స్ ఉన్నాయి. అందమైన ప్రకృతి, సెలయేరులా కొలను, విభిన్న రకాల మొక్కలు, చెట్లు, వనాలు, ఆక్సిజన్ ఇచ్చే అరుదైన ఔషధ మొక్కలు ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిని బ్యాక్ డ్రాప్లో కవర్ చేస్తూ వీడియోలు చేస్తే అదిరిపోయేలా స్పందన వస్తుంది. – తరుణ్ పైల్వాన్ , క్రియేటర్
అద్భుత ప్రదేశాలు
హైదరాబాద్‌లో లొకేషన్స్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మేం పర్యాటక ప్రాంతాలకు వెళ్లి రీల్స్ చేస్తుంటాం. మా ఫాలోవర్స్ ఈ లొకేషన్ ఎక్కడా చెప్పండి.. అంటూ కామెంట్స్ చేస్తుంటారు. చాలా మంది ఫాలోవర్స్‌కు మేం చేసిన రీల్ లొకేషన్ చెబుతాం. ఢిల్లీ నుంచి కూడా మా ఫాలోవర్స్ నగరానికి వచ్చి రీల్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతలా మన హైదరాబాద్ ప్రదేశాలు వారు ఇష్టపడుతారు.
– గౌతమ్ రాజ్, క్రియేటర్
ప్రతిభను బయటపెట్టేందుకు
హైదరాబాద్ అందరి టాలెంట్‌కు పునాదిగా ఉంటుంది. అందమైన ప్రదేశాల కోసం నగరమంతా అన్వేషిస్తుంటాం. అదృష్టం ఏంటంటే బోలెడు లొకేషన్స్ నగరంలో ఉన్నాయి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నా ఇన్‌స్టాలో లొకేషన్స్ చాలా బాగున్నాయంటూ ఎక్కువగా కామెంట్స్ వస్తుంటాయి.
– నాని, క్రియేటర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

