సమాజంలో మార్పునకు యువతే పునాది
చరిత్రలో జరిగిన గొప్ప ఉద్యమాలు, విప్లవాత్మక మార్పుల వెనుక యువత భాగస్వామ్యం కీలకంగా ఉందని, సమాజంలో మార్పునకు యువతే పునాది అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు.
- పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్
ఖైరతాబాద్, అక్టోబర్ 11 : చరిత్రలో జరిగిన గొప్ప ఉద్యమాలు, విప్లవాత్మక మార్పుల వెనుక యువత భాగస్వామ్యం కీలకంగా ఉందని, సమాజంలో మార్పునకు యువతే పునాది అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సోమాజిగూడలో ఆదివారం మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్, బీఆర్ఎస్వీ నాయకుడు మధుకర్ యాదవ్ ఆధ్వర్యంలో పట్టభద్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దాసోజు శ్రవణ్ పట్టభద్రుల ఓటు హకు ప్రాధాన్యత, యువత బాధ్యత, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నిరుద్యోగ సమస్యలపై పట్టభద్రులు గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం యువదశలోనే రాజకీయ పోరాటాల్లోకి ప్రవేశించి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని పేరొన్నారు. అయితే, ప్రస్తుత విద్యావంతులైన యువతలో రాజకీయాలు, ఓటింగ్ పట్ల నిర్లిప్తత ఆందోళన కలిగిస్తోందన్నారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో కేవలం 8 వేల ఓట్లు మాత్రమే నమోదయ్యాయని, పట్టభద్రుల ఓటు నమోదు, వినియోగంలో కనిపిస్తున్న నిర్లక్ష్యం విచారకరమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మహానగరంలోనూ ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని అన్నారు. ఒకవైపు నిరక్షరాస్యులు సైతం తమ ఓటు హకును బాధ్యతగా వినియోగించుకుంటుంటే, చదువుకున్నవారు మాత్రం ఎన్నికల రోజును సెలవు దినంగా భావించి ఇతర పనులకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. విద్యావంతులు రాజకీయ చైతన్యంతో ముందుకు వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.
కేటీఆర్ దార్శనికతతో పెట్టుబడులు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చామని దాసోజు శ్రవణ్ పేరొన్నారు. కేటీఆర్ దార్శనికత, అనుసరించిన విధానాల కారణంగా ప్రపంచ ప్రఖ్యాత సమాచార సాంకేతిక, ఔషధ రంగ సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు యువతకు లభించాయన్నారు. అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగా హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోందని విమర్శించారు. కొత్త పెట్టుబడులు రావడం లేదని, ఇప్పటికే ఉన్న సంస్థలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. హైదరాబాద్ అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువత చేసిన పోరాటాలు, త్యాగాలు మరువలేనివని దాసోజు శ్రవణ్ అన్నారు. యువత ఆత్మార్పణలు, ప్రజా ఉద్యమాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అనేక రంగాల్లో ప్రగతి సాధించిందని పేరొన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలోకి నెడుతోందని విమర్శించారు. ఉపాధి కల్పనకు సంబంధించి ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై స్పష్టత లేదన్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో కళాశాలలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మళ్లీ విద్యుత్ కోతలు, తాగునీరు, సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. ఎల్ నినో వంటి వాతావరణ మార్పుల ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగాల భర్తీలో జాప్యంపై మరోసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విద్యావంతులు, పట్టభద్రులు తమ సమస్యల పరిషారం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సోమాజిగూడ డివిజన్ మాజీ అధ్యక్షుడు ఎస్కె అహ్మద్, అంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

