చూడు చూడు.. నిరుద్యోగుల గోడు
హైడ్రాలో ఉద్యోగాల భర్తీ కోసం సరూర్నగర్ స్టేడియంలో రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టారు. దీంతో శనివారం తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చి..క్యూ లైన్లలో నిల్చున్నారు. వేలాది మంది యువకులు రావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. అధికారులు అభ్యర్థులను నియంత్రించేందుకు టోకెన్లు పంపిణీ చేపట్టారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకున్నది. ముందుకెళ్లేందుకు కొందరు యువకులు ఒకరినొకరు నెట్టుకోవడంతో గందరగోళం నెలకొంది.
- సరూర్నగర్ ఇండోర్ స్టేడియానికి తరలి వచ్చిన యువకులు
- హైడ్రా విభాగంలో ఉద్యోగాల భర్తీకి ఈవెంట్స్
హైడ్రాలో ఉద్యోగాల భర్తీ కోసం సరూర్నగర్ స్టేడియంలో రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టారు. దీంతో శనివారం తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చి..క్యూ లైన్లలో నిల్చున్నారు. వేలాది మంది యువకులు రావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. అధికారులు అభ్యర్థులను నియంత్రించేందుకు టోకెన్లు పంపిణీ చేపట్టారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకున్నది. ముందుకెళ్లేందుకు కొందరు యువకులు ఒకరినొకరు నెట్టుకోవడంతో గందరగోళం నెలకొంది. ఈ తోపులాటలో పలువురు ఒకరిపై ఒకరు కిందపడిపోయారు. కొందరికి స్వల్పగాయాలు కూడా కావడం ఆవేదనకు గురిచేస్తున్నది. తెలంగాణలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ఈ ఉదంతం తెలియజేస్తున్నది.
-ఆర్కేపురం, ఆగస్టు 8
ఆర్కేపురం, ఆగస్టు 8 : తెలగాణలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చూపించే ఘటన సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వద్ద శనివారం కనిపించింది.హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)లో ఉద్యోగాల భర్తీ కోసం ఏర్పాటు చేసి రిక్రూట్మెంట్కు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో తరలిరావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సరూర్నగర్ స్టేడియంలో ఆగస్టు 8,9 తేదీల్లో ఉదయం 5గంటలకు ఈవెంట్స్ ఉంటాయని హైడ్రా ప్రకటన విడుదల చేసింది.
హైడ్రా విభాగంలో 50 డ్రైవర్, 100 డీఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని కోసం అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. 170 సెకన్లలో 800 మీటర్ల రన్నింగ్, 15 సెకన్లలో 100 మీటర్లు, లాంగ్ జంప్ 4 మీటర్లు, 6 మీటర్ల షాట్పుట్ ( 7.2కిలోలు) ఈవెంట్లలో క్వాలిఫై అవ్వాలని హైడ్రా అధికారులు ప్రకటించారు. ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఉద్యోగ సాధనకు భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు.
ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో నిరుద్యోగ యువకులు శనివారం తెల్లవారుజాము నుంచే సరూర్నగర్ స్టేడియం వద్దకు చేరుకుని క్యూలైన్లలో నిల్చున్నారు. సమయం గడిచేకొద్దీ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువత తాకిడి విపరీతంగా పెరిగింది. చూస్తుండగానే సుమారు 2000 నుంచి 3000 మందికి పైగా యువకులు తరలిరావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో అధికారులు అభ్యర్థులను నియంత్రించేందుకు టోకెన్లు పంపిణీ చేపట్టారు. ఈ క్రమంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ముందుకెళ్లేందుకు అభ్యర్థులు ఒకరినొకరు నెట్టుకోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో పోలీసులు వెంటనే స్టేడియానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి యువతను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. నిరుద్యోగుల సంఖ్యను అంచనా వేయడంలో నిర్వాహకుల అంచనాలు తప్పడమే ఈ ఉద్రిక్తతకు ప్రధాన కారణమని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

