Bike Stunts | వర్షంలో బైక్ స్టంట్స్.. జారిపడి యువకుడు మృతి
రీల్స్ పిచ్చి ప్రాణాల మీదికి తీసుకొస్తున్నది. సోషల్ మీడియాలో హైలెట్ అవడానికి రీల్స్ (Reels) చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇంత జరుగుతున్నా జనాల్లో మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.
హైదరాబాద్: రీల్స్ పిచ్చి ప్రాణాల మీదికి తీసుకొస్తున్నది. సోషల్ మీడియాలో హైలెట్ అవడానికి రీల్స్ (Reels) చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇంత జరుగుతున్నా జనాల్లో మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. శనివారం రోజంతా వర్షం పడుతూనే ఉన్నది. అయితే వారికి మాత్రం ఆ వానలో బైక్‌పై రీల్స్ చేయాలన్న ఆలోచన వచ్చింది. ఇంకేముంది చేతిలో బైక్ ఉంది. తమతోపాటు మరో ఇద్దరు స్నేహితులను జమచేసుకున్నారు. జోరు వానలో హైదరాబాద్-విజయవాడ హైవేపై అంబర్‌పేట వద్ద బైక్‌పై రివ్వుమని దూసుకెళ్తూ స్టంట్స్ చేస్తున్నారు. ఒక బైకర్ స్టంట్ (Bike Stunts) చేస్తుండగా మరో బైక్ ఉన్న యువకులు వీడియో తీస్తున్నారు.
ఇలా శివ అనే యువకుడు కూర్చున్న బైక్ నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా దానిని పైకి లేపాడు. ఈ క్రమంలో బైక్‌పై అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో వారిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్నేహితులు వారిని దవాఖానకు తరలించారు. శివ మృతిచెందగా, బైక్ నడుపుతున్న యువకుడు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. చేతికందిన కొడుకు ప్రాణాలు విడవడంతో ఆ తల్లిదండ్రులు దుఃఖాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

