Anakapalli | నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫేమ్ యాక్టర్ విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట కాంబోలో వస్తున్న చిత్రం ‘అనకాపల్లి’ (Anakapalli). ఇంటెన్స్ పల్లెటూరి యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో పుష్ప 2 విలన్ తారక్ పొన్నప్ప వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన అమ్మోరు దిగినాది, లబ్బరు బొమ్మ సాంగ్స్ విడుదల చేయగా మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి.
తాజాగా ఈ మూవీ నుంచి ఎలగే పిల్లా అంటూ సాగే సాంగ్‌ను పాపులర్ ప్రొడ్యూసర్ నాగవంశీ విడుదల చేశారు. విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట రొమాంటిక్ జర్నీ నేపథ్యంలో సాగుతున్న ఈ పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని విజువల్స్ హింట్ ఇచ్చేస్తున్నాయి. ఖగేష్ తమ్మినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. అనకాపల్లి మూవీలో త్రినాధరావు నక్కిన కీ రోల్లో కూడా నటిస్తున్నాడు.
ఈ మూవీలో ఇంద్రజ అబ్బర్, మహబూబ్‌నగర్ భాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందినీ రాయ్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నక్కిన నరేటివ్స్, భవ్య శ్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై త్రినాథరావు నక్కిన, నాయుడు కాండ్రేగుల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డావ్జాండ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
The much-awaited #YelagePilla song from #Anakapalli is officially launched by the sensational producer @vamsi84 Garu! 🔥🎉
Get ready to vibe with this beautiful track that’s set to become your next favorite. ❤️🎧
▶️ https://t.co/OUlJ65iib7@TrinadharaoNak1#VikramSahidev… pic.twitter.com/RMKe0Jj7JI
— BA Raju’s Team (@baraju_SuperHit) July 15, 2026