Suicide | నగరంలో విషాదం.. భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య
Suicide | హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల అకస్మాత్తుగా రక్తపోటు ఎక్కువై భర్త హఠాన్మరణం పాలవడాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మరణంతో తీవ్రంగా కుంగిపోయి చివరికి ఉసురు తీసుకుంది.
Suicide: హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల అకస్మాత్తుగా రక్తపోటు ఎక్కువై భర్త హఠాన్మరణం పాలవడాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మరణంతో తీవ్రంగా కుంగిపోయి చివరికి ఉసురు తీసుకుంది. మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రహీంపురాకు చెందిన అమన్‌కుమార్ సింగ్ (36), అప్పర్ ధూల్‌పేట ఆరాంఘర్ కాలనీకి చెందిన అస్మిత (31) భార్యాభర్తలు. వీరికి రోనక్, రిత్విక్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గచ్చిబౌలిలో ప్రైవేటు ఉద్యోగం చేసే అమన్‌కుమార్ సింగ్ గత నెల 26న రాత్రి ఒక్కసారిగా బీపీ ఎక్కువై బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందాడు.
అప్పటి నుంచి 15 రోజులుగా అస్మిత మానసిక వేదనను అనుభవించింది. భర్త ఫొటోను దగ్గర పెట్టుకొని బాధపడింది. చివరికి మనస్తాపంతో మంగళవారం సాయంత్రం ఆరాంఘర్ కాలనీలోని పుట్టింట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

