Cantonment By Election | ముగిసిన నామినేషన్ల ఉప సంహరణ.. కంటోన్మెంట్ బరిలో ఎంతమంది ఉన్నారంటే?
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి హైదరాబాద్లో 8 మంది, సికింద్రాబాద్ నుంచి ఒకటి, కంటోన్మెంట్ నుంచి ఐదుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ బరిలో 38 మంది అభ్యర్థులు నిలిచారు.
Cantonment By Election | సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి హైదరాబాద్లో 8 మంది, సికింద్రాబాద్ నుంచి ఒకటి, కంటోన్మెంట్ నుంచి ఐదుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ బరిలో 38 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ అభ్యర్థులకు సాధారణ పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో గుర్తులను కేటాయించారు. సికింద్రాబాద్ బరిలో 45 మంది అభ్యర్థులు, కంటోన్మెంట్లో 23 నామినేషన్లు వేస్తే ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా, ఐదుగురు విత్ డ్రా చేసుకోగా బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులతో పాటు జాతీయ, రాష్ట్రీయ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్రులు బరిలో నిలిచారు.
మల్కాజిగిరి బరిలో 22 మంది..
మేడ్చల్, ఏప్రిల్29 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి లోక్ సభ బరిలో 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మల్కాజిగిరి లోక్ సభ స్థానానికి 114 మంది అభ్యర్థులు 177 నామినేషన్లు దాఖలు చేయగా… నామినేషన్ల పరిశీలన అనంతరం 77 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించగా 37 నామినేషన్లను ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా సోమవారం 15 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. బరిలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో గుర్తులను కేటాయించామని తెలిపారు.
చేవెళ్ల బరిలో 43 మంది..
రంగారెడ్డి, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): చేవెళ్ల లోక్సభ నుంచి 43 మంది బరిలో నిలిచారు. మొత్తం 64 మంది అభ్యర్థులు 88 నామినేషన్లను దాఖలు చేశారు. ఈనెల 26న స్క్రూట్నీ ప్రక్రియ పూర్తయ్యాక 18 మంది నామినేషన్లను తిరస్కరించడంతో బరిలో 46 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో 23 మంది వివిధ జాతీయ, రాష్ట్రీయ గుర్తింపు పొందిన పార్టీల నుంచి నామినేషన్లను దాఖలు చేయగా..మరో 23 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. నామినేషన్ల ఉప సంహరణ సందర్భంగా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే ఉప సంహరించుకున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శశాంక రాజేంద్రనగర్లోని ఆర్వో కార్యాలయంలో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు అభ్యర్థుల సమక్షంలో గుర్తులను కేటాయించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

