Manne krishank | బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మరోసారి అన్ని ఆధారాలతో సహా మంత్రి సీతక్క శాఖలో జరిగిన అంగన్వాడీల మొబైల్ ఫోన్ల స్కాం బయటపెట్టారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ల స్కాం విషయంలో సీతక్క కేసీఆర్‌కు నోటీసులు పంపే బదులు సీబీఐ విచారణకు ఆదేశించవచ్చు కదా..? అన్నారు.
ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు ఈ ఫోన్ల స్కాం చేశాడని మాకు సమాచారముంది.. సీతక్క ఎవరిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నరు.. మాకున్న సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడు.. సల్మాన్ ఖాన్ దగ్గరికి పోయినా లేకుంటే మిస్ ఇంగ్లాండ్, మిస్ వరల్డ్ కాంపీటీషన్స్ కు పోయినా.. రాష్ట్రంలో ఏ పర్యటనలకు పోయిన వ్యక్తి ఉన్నడో ఆ వ్యక్తే ఈ కాంట్రాక్టును సీతక్క దగ్గరకు తీసుకెళ్లి ఇదంతా చేసిర్రు కావొచ్చని మాకు సమాచారం ఉంది. ఆ పేరు బయటపెట్టండి తేలిపోవద్దు. విచారణ చేస్తే మా ఆరోపణల్లో తప్పుందా.. మీది తప్పుందా అని తేలిపోతది కదా అన్నారు. అందుకే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించండని డిమాండ్ చేశారు.
ఏ రోజు కేటీఆర్ చెప్పుతో కొడతానని అనలేదు కదా..
స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో స్కామ్‌కు పాల్పడి 4G ఫోన్లు ఇస్తూ… 5G ఫోన్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్న వారిని ఏ చెప్పుతో కొట్టాలో సీతక్క సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అడిగారు. మేము మొబైల్ ఫోన్ల స్కాం గురించి మాట్లాడుతుంటే, సీతక్క చెప్పుతో కొడతానని అంటుంది. ఫార్ములా ఈ గురించి ఇన్ని సార్లు ఏసీబీ దర్యాప్తులు చేయించి, గవర్నర్ వద్దకు వెళ్ళినా ఏ రోజు కేటీఆర్ చెప్పుతో కొడతానని అనలేదు కదా అని అన్నారు.
అంగన్వాడీ వర్కర్ల కోసం ఇచ్చే స్మార్ట్ ఫోన్ల కాంట్రాక్ట్‌కు సీతక్కకు సంబంధమే లేదంటూనే, ఇప్పుడు చెప్పుతో కొడుతానని అనడం ఏంటి..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వం.. అందుకే ఈ ప్రభుత్వం చేసే విచారణపై మాకు నమ్మకం లేదన్నారు.ఈ స్కామ్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి కాబట్టి, మేము సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఆంధ్రా పేపర్లో వేసిన ఫోటోను తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్లో వేసుకున్నారు. 2025లో హిందూ పేపర్ విజయవాడ ఎడిషన్‌లో వచ్చిన ఫోటోను, తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్లో 5G ఫోన్లు ఇస్తున్నామని వేసుకుంటున్నారని మండిపడ్డారు.
స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో స్కామ్‌కు పాల్పడి 4G ఫోన్లు ఇస్తూ… 5G ఫోన్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్న వారిని ఏ చెప్పుతో కొట్టాలో సీతక్క సమాధానం చెప్పాలి.
అంగన్వాడీ వర్కర్ల కోసం ఇచ్చే స్మార్ట్ ఫోన్ల కాంట్రాక్ట్‌కు సీతక్కకు సంబంధమే లేదంటూనే, ఇప్పుడు చెప్పుతో కొడుతానని అనడం ఏంటి?… pic.twitter.com/M1pkbxEUgb
— BRS Party (@BRSparty) April 13, 2026