Minister Bhatti Vikramarka | త్వరలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం : మంత్రి భట్టి విక్రమార్క
Minister Bhatti Vikramarka | తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిఖ, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిఖ, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ( Minister Bhatti Vikramarka ) అన్నారు. తెలంగాణ అర్ధగణాంక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2014 ఫోరం డైరీని డాక్టర్ అంబేద్కర్ ప్రజా భవన్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్ ఉద్యోగుల సమస్యలను ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రం ద్వారా వివరించారు. అర్ధగణాంక శాఖ నూతన స్టాఫింగ్ పాటర్న్ , ఉప గణాంక అధికారి పోస్టులను మల్టీ జోన్ పోస్టుగా మార్చాలని కోరారు. ఉద్యోగుల పీఆర్సీ(Employees PRC) , పెండింగ్ లో ఉన్న కరువు భత్యం, పెండింగ్లో డీఏలు, సీపీఎస్ రద్దు, 317- జీవో ల వల్ల జరిగిన అన్యాయాలను సరి చేయాలని సూచించారు.
ఉద్యోగులకు చందాతో కూడిన ఆరోగ్య కార్డ్స్ (Health Cards) మంజూరు చేయాలని, ఆంధ్రాలో పని చేస్తున్న 84 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించడం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్ధ గణాంక శాఖ సంచాలకులు దయానందం, టెస్సా కార్యదర్శి హరికృష్ణ, మంత్రి ప్రగడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

