Mayor Vijayalaxmi | వినాయక చవితి పర్వదినానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం : మేయర్ విజయలక్ష్మి
Mayor Vijayalaxmi | వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అన్ని ఏర్పాట్లు చేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 06 : వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అన్ని ఏర్పాట్లు చేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా పోలీస్, హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ, మెట్రో, జలమండలి, హెల్త్, అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ రోనాల్డ్ రోస్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై సమన్వయ సమావేశం బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా మేటర్ మాట్లాడుతూ..వినాయక చవితి పండుగ ఉత్సవాల సందర్భంగా నగరంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు సూచించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. హెచ్ఎండీఏ ద్వారా స్టాటిస్టిక్స్ మొబైల్ క్రేన్లు గత ఏడాది కంటే ఎక్కువ క్రేన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రోడ్లపై బారీకేడ్, శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్స్, మొబైల్ ట్రీ కటింగ్, ప్రూనింగ్, ఆరోగ్య శిబిరాలు, బోట్స్, స్విమ్మర్లు, నిరంతరంగా విద్యుత్తు సరఫరా, వీధి లైట్స్, పాట్ హాల్స్, రోడ్డు మరమ్మతులు, అగ్ని మాపక యంత్రాలు, తాగు నీటి సరఫరా తదితర ఏర్పాట్లు చేయనున్నట్లు మేయర్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

