రాష్ట్రపతి నిలయానికిసందర్శకుల తాకిడి
రాష్ట్రపతి భవనంలోని అందాలను వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి సందర్శకులు, పాఠశాలల విద్యార్థులు మంగళవారం ఉదయం నుంచే తరలివచ్చారు.
బొల్లారం, జనవరి 3 : రాష్ట్రపతి భవనంలోని అందాలను వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి సందర్శకులు, పాఠశాలల విద్యార్థులు మంగళవారం ఉదయం నుంచే తరలివచ్చారు. భవనం చుట్టూ ఉన్న పూలతోటలు, పండ్ల తోటలు, వాటర్ ఫాల్స్, అందమైన గార్డెన్‌ను వీక్షిస్తూ, సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. రెండవ రోజు 325 మంది రాష్ట్రపతి భవనాన్ని సందర్శించినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.
రాక్ గార్డెన్, జలపాతం..!
రాష్ట్రపతి భవనంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గత విడిది సమయంలో కొత్తగా ఏర్పాటు చేసిన రాతి వనం(రాక్ గార్డెన్) జలపాతం, పాలమాటం (జపాన్ మొక్కల తోట)ను ప్రారంభించారు. ఈ గార్డెన్లో జింకలు, పులుల బొమ్మలు యువతను, చిన్నారులను ఆకట్టుకున్నాయి. జలపాతం వద్ద సందర్శకులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
నక్షత్ర వాటిక
రాష్ట్రపతి నిలయంలోని నక్షత్రవాటికను 2013 డిసెంబర్లో ఏర్పాటు చేశారు. అప్పుడు శీతాకాల విడిది సమయంలో ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఎకరన్నర స్థలంలో వలయాకారంలో చూడముచ్చటగా ఉన్న ఈ నక్షత్ర వాటికను చూసి సందర్శకులు మురిసిపోయారు.
ఔషధ వనం
రాష్ట్రపతి భవన్లో 2010లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఔషధ వనం ఏర్పాటు చేశారు. ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఔషధ వనంలోని 116 మొక్కలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
సొరంగ మార్గం
సొరంగ మార్గం ఇక్కడ ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నది. వంటశాల నుంచి 50 మీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గం ద్వారా రాష్ట్రపతి డైనింగ్ రూమ్‌కు ఇప్పటికీ భోజనం తీసుకువెళ్లడం విశేషం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

