16 బోగీలతో వందేభారత్ రైలు
సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఎనిమిది బోగీలు బదులుగా పదహారు బోగీలతో బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ రెండు రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
- వందేభారత్ రైలులో బోగీలు 8 నుంచి 16కు పెంపు
- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారుల నిర్ణయం
- సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.15గంటల్లో ప్రయాణం
సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఎనిమిది బోగీలు బదులుగా పదహారు బోగీలతో బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ రెండు రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
వందేభారత్‌లో 16 బోగీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రయాణ సమయం 15 నిమిషాలు తగ్గించారు. గతంలో సికింద్రాబాద్-తిరుపతి స్టేషన్ల మధ్యలో ప్రయాణం చేయడానికి 8.30 గంటల సమయం పట్టేది. కానీ రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం బుధవారం నుంచి ప్రయాణ సమయం 8.15 గంటలకు తగ్గిందని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

