ఎయిర్‌పోర్టు వద్ద అండర్‌గ్రౌండ్‌లో మెట్రో స్టేషన్ : మెట్రో ఎండీ
Metro Rail | ఎయిర్‌పోర్టు మెట్రోను రాబోయే మూడేండ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. 27.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్‌లో బయో డైవర్సిటీ వద్ద రెండు ఫ్లై ఓవర్ల పైనుంచి మెట్రో వెళ్తుందన్నారు. ఎయిర్‌పోర్టు వద్ద 2.5 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ అండర్ గ్రౌండ్లో వెళ్తుందని
హైదరాబాద్ : మెట్రో రెండో దశలో భాగంగా మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులకు మైండ్ స్పేస్ వద్ద సీఎం కేసీఆర్ గురువారం ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎయిర్‌పోర్టు మెట్రోను రాబోయే మూడేండ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. 27.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్‌లో బయో డైవర్సిటీ వద్ద రెండు ఫ్లై ఓవర్ల పైనుంచి మెట్రో వెళ్తుందన్నారు. ఎయిర్‌పోర్టు వద్ద 2.5 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ అండర్ గ్రౌండ్లో వెళ్తుందని పేర్కొన్నారు. అక్కడ అండర్ గ్రౌండ్‌లోనే మెట్రో స్టేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. మెట్రో గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని తెలిపారు. 31 కిలోమీటర్ల దూరాన్ని 26 నిమిషాల్లో చేరుకుంటారని పేర్కొన్నారు. రద్దీ సమయంలో ఎయిర్‌పోర్టుకు 8 నిమిషాలకు ఒక రైలు, రద్దీ లేని సమయంలో 20 నిమిషాలకు ఒక రైలు నడిపిస్తామన్నారు. భవిష్యత్‌లో 2.5 నిమిషాల నుంచి 5 నిమిషాలకు ఒక రైలు ఉండేలా చూస్తామన్నారు. రాయదుర్గం స్టేషన్లోనే చెక్ ఇన్, లగేజ్ చెక్ ఇన్ చేసేలా చూస్తున్నామని తెలిపారు.
31.50 కోట్ల మంది ప్రయాణం..
మెట్రోలో ఇప్పటి వరకు 31.50 కోట్ల మంది ప్రయాణించారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ద్వారా 9.2 కోట్ల లీటర్ల పెట్రోల్, డీజిల్ ఆదా అయింది. మెట్రో రెండో విడత డీపీఆర్‌ను కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే బీహెచ్ఈఎల్ – లక్డీకాపూల్ మెట్రో పనులను ప్రారంభిస్తామని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

