Hyderabad | హైదరాబాద్‌లో ఇద్దరు దొంగలు అరెస్ట్.. 36 గడియారాలు సీజ్
Hyderabad | హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఓ దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఓ దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళా కూడా ఉన్నారు. దొంగల నుంచి 20 గ్రాముల బంగారం, 720 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు 36 గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను హబీబ్ మహమ్మద్(35), మహజబీన్ షరీఫ్(39)గా పోలీసులు గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఇద్దరు దొంగలు హైదరాబాద్‌లో అనేక దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఆయా కాలనీల్లో దొంగలు సంచరిస్తూ.. తాళం వేసి ఉన్న నివాసాలను టార్గెట్ చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నట్లు తేలింది. రాత్రివేళ హబీబ్ దొంగతనాలకు పాల్పడుతూ.. విలువైన వస్తువులను దోచుకుంటున్నట్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఆ వస్తువులను షరీఫ్‌కు అప్పగించేవారు. ఆ వస్తువులను విక్రయించగా వచ్చిన డబ్బులను ఇద్దరూ పంచుకునే వారని పోలీసుల విచారణలో తేలింది. హబీబ్ 50 దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- gold
- Hyderabad
- pahadishareef
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

