శేరిలింగంపల్లి, జూన్ 26: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన కేతావత్ విఠల్ (38), అదే ప్రాంతానికి చెందిన బానోత్ శ్రీకాంత్ (17) ఇద్దరూ కలిసి శుక్రవారం స్కూటీపై హఫీజ్‌పేట నుంచి గచ్చిబౌలి వైపు కొండాపూర్ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్తున్నారు. అదే సమయంలో ఎస్ఎల్ఎన్టీ మాల్ వద్ద బైక్‌పై ఎదురుగా వచ్చిన వినోద్ అనే వ్యక్తి వీరి వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో విఠల్, శ్రీకాంత్ తీవ్రంగా గాయపడి..మృత్యువాతపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.