Hyderabad | మేడిపల్లి, బాచుపల్లిలో హెచ్ఎండీఏ భారీ లేఅవుట్లు.. మార్చి నుంచి ఆన్లైన్లో వేలం
Hyderabad | నగరంలో ఆధునిక మౌలిక వసతులతో రెండు లేఅవుట్లను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. తూర్పున పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, ఉత్తరాన బాచుపల్లిలో రెండు భారీ లేఅవుట్లను అభివృద్ధి చేసి, ఆన్లైన్లో విక్రయించేందుకు సిద్ధం చేశారు.
Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): నగరంలో ఆధునిక మౌలిక వసతులతో రెండు లేఅవుట్లను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. తూర్పున పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, ఉత్తరాన బాచుపల్లిలో రెండు భారీ లేఅవుట్లను అభివృద్ధి చేసి, ఆన్లైన్లో విక్రయించేందుకు సిద్ధం చేశారు. ఔటర్ రింగురోడ్డు లోపల అత్యంత కీలకమైన ప్రాంతాలైన బాచుపల్లి, మేడిపల్లిలో విశాలమైన స్థలాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
నివాస ప్రాంతాలకు ఎంతో అనుకూలంగా ఉండటంతో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్‌ను రూపొందిస్తున్నారు. వరంగల్ జాతీయ రహదారికి అర కిలోమీటరు దూరంలో మేడిపల్లి రెవెన్యూ పరిధిలో 55 ఎకరాల స్థలంలో ఒక లేఅవుట్ ఉండగా, మరో లేఅవుట్ మియాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి గండి మైసమ్మ వెళ్లే మార్గంలో బాచుపల్లి ప్రాంతంలో 27 ఎకరాల స్థలంలో లేఅవుట్‌ను అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. వీటిని ఆన్లైన్లో విక్రయించేందుకు హెచ్ఎండీఏ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది.మార్చి 2,3 తేదీల్లో బాచుపల్లి , మార్చిన 6న మేడిపల్లిలోని ప్లాట్లకు వేలం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆన్లైన్ వేలం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు వేలం నిర్వహణను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించామని, రిజిస్ట్రేషన్ నుంచి మొదలు కొని అన్ని వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని, నిర్ణయించిన తేదీల్లో ఆయా సైట్ల వద్ద ఫ్రీ బిడ్ మీటింగ్ ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

