హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు బ్రేక్ ఫెయిలైంది. దీంతో అదుపుతప్పిన కారు డివైడర్‌ను, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.