బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం.. ఇద్దరు మృతి
Accident | బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ఆదివారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ఆదివారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు.. రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను అయోధ్యరాయ్, దేవేంద్రకుమార్ దాస్‌గా గుర్తించారు. వారిద్దరు ఓ ప్రవైట్ దవాఖానలో పనిచేస్తున్నారని, చాయ్ తాగేందుకు బయటకు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతదేహాలను ఉస్మానియా దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో కారును ఉప్పల్‌కు చెందిన రోహిత్ గౌడ్ నడుపుతున్నాడని, అతడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కారును సీజ్ చేసిన పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Accident
- Banjarahills
- car
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

