హైదరాబాద్ : నగరంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో(Pond) పడి ఓ బాలుడు మృత్యువాత (Boys died) పడగా మరొకరు గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి చెరువులో పడి మునిగిపోయాడు. గమనించిన మరో బాలుడు రక్షించబోయి తను గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.