ట్రేడింగ్ మోసం కేసులో ఇద్దరి అరెస్ట్
ట్రేడింగ్ మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు మహారాష్ట్రలోని నవీముంబై, వాషి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెంది ఓ వ్యక్తి ఆగస్ట్‌లో తాను మోసపోయానంటూ సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
- నవీ ముంబైలో పట్టుబడ్డ నిందితులు
సిటీబ్యూరో, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): ట్రేడింగ్ మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు మహారాష్ట్రలోని నవీముంబై, వాషి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెంది ఓ వ్యక్తి ఆగస్ట్‌లో తాను మోసపోయానంటూ సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ముంబైకి చెందిన రవికుమార్లాల్, శివేంద్ర అశోక్సింగ్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన 53 ఏళ్ల వ్యక్తిని ప్లేమ్స్ అలయ్స్, మునోత్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ కంపెనీ పేర్లతో స్టాక్ మార్కెట్ నిపుణులుగా నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఆయనతో నకిలీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి వివిధ బ్యాంక్ ఖాతాల్లో బాధితుడి నుంచి రూ.12.30లక్షలు పెట్టుబడి పెట్టించారు.
మరిన్ని చెల్లింపులు చేయమని డిమాండ్ చేయడంతో తాను చేయనని బాధితుడు చెప్పారు. దీంతో బాధితుడిని గ్రూప్ నుంచి తొలగించి అతని నెంబర్‌ను బ్లాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నవీముంబైలో నివసిస్తున్న రవికుమార్లాల్ రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఏపీకే ఫైల్ ద్వారా పూణెకు చెందిన విరాజ్‌తో ఓటీపీలు పంచుకుంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్‌ను ఆపరేట్ చేయడంలో సహాయం చేశారని, శివేంద్ర అశోక్‌సింగ్ నవీ ముంబైలో మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్‌ను తెరిచి వాటిని రవికుమార్లాల్కు సరఫరా చేసేవారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఇద్దరు నిందితులపై దేశవ్యాప్తంగా మొత్తం 12కేసులు ఉన్నాయని, వీరు బ్యాంకుల ద్వారా మ్యూల్ అకౌంట్స్, ఓటీపీలు పంచుకోవడంతో మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే..!
Damarukam | 14 ఏళ్ల నాగార్జున రికార్డుకు ఎసరు.. ‘ఢమరుకం’కి చేరువలో తరుణ్ భాస్కర్, దుల్కర్ సినిమాలు!
Cholesterol | కొలెస్ట్రాల్ సాధారణంగానే ఉన్నా గుండెకు ప్రమాదం తప్పదా? ఈ పరీక్షలు కీలకం!
BRS Complaint | బీఆర్ఎస్ నాయకుడిపై దాడి..కేసులు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు
Allu Arjun | సినిమాల విషయంలో రూటు మార్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇకపై వరుస సినిమాలతో బిజీ బిజీ!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

