కవాడిగూడ : టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను భోలక్‌పూర్ టీఆర్ఎస్ నాయకులు సోమవారం ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనారిటీ నాయకుడు మహ్మద్ రహీం, భోలక్‌పూర్ బీసీ సెల్ అధ్యక్షుడు గుండా ఉమాకాంత్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు ఏ.శంకర్ గౌడ్, మున్వర్ చాంద్, గౌస్భాయ్ తదితరులు పాల్గొన్నారు.