ట్రాఫిక్ తిప్పలు పట్టించుకోరా?
హైదరాబాద్‌లో పది నిమిషాల పాటు వర్షం కురిస్తే చాలు..రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఎక్కడికక్కడే ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతున్నది. మే నెలలో కురిసిన ఆకస్మిక వర్షాలతోనైనా మేల్కొని జూన్ నాటికి జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సింది పోయి, ఇంకా నిద్రావస్థలోనే ఉన్నారు.
- చినుకుపడితే.. జంక్షన్లు జామ్
- మేల్కోని అధికార యంత్రాంగం
- రెండు శాఖల మధ్య సమన్వయలోపంతో ట్రాఫిక్ కష్టాలు
- వానొస్తే.. వాహనదారులకు చుక్కలే
- స్కూళ్లు మొదలైతే..మరింత రద్దీ
- వాటర్ లాంగింగ్ పాయింట్స్‌పై దృష్టి పెట్టకపోతే.. ఇబ్బందులే
సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో పది నిమిషాల పాటు వర్షం కురిస్తే చాలు..రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఎక్కడికక్కడే ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతున్నది. మే నెలలో కురిసిన ఆకస్మిక వర్షాలతోనైనా మేల్కొని జూన్ నాటికి జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సింది పోయి, ఇంకా నిద్రావస్థలోనే ఉన్నారు. దీంతో చినుకుపడితే హైదరాబాద్, సైబరాబాద్ జంక్షన్లు జామ్ అవుతున్నాయి. వచ్చే వారం నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. అధికార యంత్రాంగం ఇలాగే నిద్రమత్తులో ఉంటే నగర వాసులకు మరిన్ని ట్రాఫిక్ కష్టాలు తప్పేటట్లు లేవు. గతంలో ట్రాఫిక్, జీహెచ్ఎంసీ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకువారు. అయితే నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. రెండు రోజుల నుంచి నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం అరగంట పాటు కురిసిన వర్షానికి సైబరాబాద్‌లోని ప్రధాన రహరదారిపై కూడళ్లు జామ్ అయి రాత్రి వరకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అలాగే గురువారం మధ్యాహ్నం అరగంటకుపై వర్షం కురిసింది. దీంతో నగరంలోని బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు సైబరాబాద్‌లో మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, హైటెక్ సిటీ, ఐకియా ప్రాంతాల్లో ఎక్కడికక్కడే వాహనాలు స్తంభించి.. కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మధ్యాహ్నం నుంచే ట్రాఫిక్ రద్దీ ఉండటం, సాయంత్రం కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇండ్లకు చేరుకునే సమయం కావడంతో మరిన్ని వాహనాలు అప్పటికే ఆగి ఉన్న ట్రాఫిక్‌కు జతకలవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
అప్రమత్తత లేకపోవడంతో..
ఇటీవల జరిగిన ఉదంతాలతో బల్దియా అధికారులు మేల్కోవాల్సిన అవసరమున్నది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 150కిపైగా ప్రధాన వాటర్ లాంగింగ్ పాయింట్లు ఉన్నాయి. అందులో ప్రధాన కూడళ్లకు దగ్గర, ప్రధాన రహదారులపై సమస్యలను సృష్టించేవి కొన్నే ఉంటాయి. ఒక మోస్తరు వర్షం కురిసిందంటే.. అక్కడ వర్షపు నీరు చేరుతుంది. దీంతో అటు నుంచి వెళ్లే వాహనదారులు నెమ్మది కావడం వల్ల వెనుక వచ్చే వాహనాలపై ఆ ప్రభావం పడి ట్రాఫిక్ రద్దీకి కారణమవుతున్నది. అయితే వర్షం పడే అవకాశం ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై వాటర్ లాంగింగ్ పాయింట్స్ వద్ద పరిస్థితిని ఎప్పకటిప్పుడు గమనిస్తూ ఉండాలి. కానీ ఆ అప్రమత్తత ఇప్పుడు కనిపించడం లేదు.
స్కూళ్లు మొదలైతే..
పాఠశాలలకు వేసవి సెలవులు ముగింపునకు చేరుకున్నాయి. వచ్చే వారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన ట్రాఫిక్‌తో మరింత రద్దీ ఏర్పడుతుంది. స్కూల్ బస్సులు ప్రారంభం, ముగింపునకు అటూ ఇటూ వర్షం కురిసిందంటే.. మరింత రద్దీ ఏర్పడుతుంది. సాయంత్రం వేళ డ్యూటీలు ముగించుకొని.. ఇంటికి వెళ్లే వారు ఉంటారు కాబట్టి.. రద్దీ మరింత రెట్టింపవుతుంది. దీంతో రోడ్లపై ఎక్కడి ట్రాఫిక్ అక్కడ జామ్ అయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంటుంది. ట్రై పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ ట్రాఫిక్ విషయంలో మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుతున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ సిబ్బందిని సమన్వయ పరుస్తూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

