రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై రేపట్నుంచే స్పెషల్ డ్రైవ్
Traffic Rules | రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ట్రాఫిక్ ఉల్లంఘనలపై సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ మొదలు కానుంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు గత కొద్ది రోజుల క్రితం ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్ చేపట్టిన సంగతి
హైదరాబాద్ : రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ట్రాఫిక్ ఉల్లంఘనలపై సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ మొదలు కానుంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు గత కొద్ది రోజుల క్రితం ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్ చేపట్టిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్న విషయం విదితమే.
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సర్కిల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1000, పాదాచారులకు అడ్డు కలిగించేలా వాహనాలు నిలిపితే రూ.600 ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే భారీ ఫైన్స్ విధిస్తున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ రోప్’ విజయవంతం కావడంతో.. తాజాగా ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తే రూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 ఫైన్ వేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి రాంగ్‌రూట్, ట్రిపుల్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ట్రాఫిక్ పోలీసులెవ్వరూ లేరు కదా అని ఇష్టానుసారంగా వాహనం నడిపినా.. ఎవరూ చూడడం లేదని నిబంధనలకు విరుద్ధంగా సిగ్నల్స్ జంప్ చేసినా సీసీ కెమెరాల్లో దృశ్యాలను బట్టి.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనల మేరకు వాహనాలను నడుపుతూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

