Traffic Restrictions | రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. పలు చోట్ల దారి మళ్లింపు
Traffic Restrictions | మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు.
Traffic Restrictions | హైదరాబాద్ : మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్స్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ వైపు ఉన్న దారుల్లో ఆంక్షలు విధిస్తున్నామని, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
టివోలి క్రాస్ రోడ్స్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్స్ వరకు రోడ్డు మూసివేయనున్నారు. ఇక పంజాగుట్ట – గ్రీన్‌ల్యాండ్స్ – బేగంపేట – సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ మార్గంలో వెళ్లాలనుకునే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్నారు.
ఆలుగడ్డ బావి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సంగీత్ క్రాస్ రోడ్ వైపు, క్లాక్ టవర్, ప్యాట్నీ, పారడైజ్ మీదుగా మళ్లిస్తామని తెలిపారు. తుకారాంగేట్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయింట్ జాన్స్ రోటరీ వైపు.. సంగీత్, క్లాక్ టవర్, ప్యాట్నీ, పారడైజ్ మీదుగా మళ్లిస్తామన్నారు.
సంగీత్ క్రాస్ రోడ్స్ నుంచి బేగంపేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను వైఎంసీఏ నుంచి క్లాక్ టవర్ వైపు ప్యాట్నీ, పారడైజ్, సిటిఓ, రసూల్‌పుర నుంచి బేగంపేట వైపునకు మళ్లించనున్నారు.
బేగంపేట నుంచి సంగీత్ క్రాస్ రోడ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను బలామ్‌రాయి, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్ ఉప్కార్, వైఎంసిఎ, సెయింట్ జాన్స్రోటరీ నుంచి సంగీత్‌వైపు మళ్లిస్తారు. బోయిన్పల్లి, తాడ్బంద్ నుంచి టివోలి వైపునకు బ్రూక్ బాండ్ మీదుగా సిటిఓ, రాణిగంజ్, టాంక్బండ్ మీదుగా మళ్లిస్తారు.
కార్ఖానా, జేబీఎస్ నుంచి ఎస్‌బిహెచ్ ప్యాట్నీ వైపు వెళ్లే వాహనాలను స్వీకార్ ఉప్కార్ వద్ద వైఎంసిఏ, క్లాక్‌టవర్, ప్యాట్నీ మీదుగా టివోలి వైపు మళ్లిస్తారు. ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలను స్వీకార్‌ఉప్‌కార్, ఎస్‌బిహెచ్ వైపుకు రానివ్వకుండా, క్లాక్‌టవర్, వైఎంసిఏ, సిటిఓ వైపు మళ్లిస్తారని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

