Musi River | పురానాపూల్ వద్ద మూసీ నది ఉధృతి.. 100 ఫీట్ల రోడ్డు మూసివేత
Musi River | హైదరాబాద్ శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో పురానాపూల్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
Musi River | హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో పురానాపూల్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ నుంచి లంగర్‌హౌజ్ వెళ్లే వంద ఫీట్ల రోడ్డుపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మూసీ వరద ఉధృతితో వంద ఫీట్ల రోడ్డుపై అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఆ రహదారి వైపునకు వాహనాలకు అనుమతించడం లేదు. మూసీ పరివాహ ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు.
హిమాయత్ సాగర్‌కు 4 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 6 గేట్లు ఎత్తారు. మూసీలోకి 4,120 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ ప్రస్తుత, పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులుగా ఉంది.
ఉస్మాన్ సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 2,200 క్యూసెక్కులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1789.90 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులుగా ఉంది. ఈ జలాశయం 6 గేట్లు ఎత్తి మూసీలోకి 2,028 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

