పాలల్లో కెమికల్ వాడుతూ.. విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
పాలల్లో తెలుపు రంగు పెరిగి, చిక్కదనం వచ్చేందుకు అమ్మోనియా సల్ఫేట్‌ను కలిపి విక్రయిస్తున్న ముగ్గురిని హబీబ్‌నగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 80 లీటర్ల పాలు, అమ్మోనియా సల్ఫేట్, కేసర్ ఎల్లో కలర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మెహిదీపట్నం, ఏప్రిల్ 21: పాలల్లో తెలుపు రంగు పెరిగి, చిక్కదనం వచ్చేందుకు అమ్మోనియా సల్ఫేట్‌ను కలిపి విక్రయిస్తున్న ముగ్గురిని హబీబ్‌నగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 80 లీటర్ల పాలు, అమ్మోనియా సల్ఫేట్, కేసర్ ఎల్లో కలర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాంబాబు కథనం ప్రకారం.. కింగ్‌కోఠికి చెందిన ప్రభాకర్ రెడ్డి(40), గాంధీ భవన్ ప్రాంతానికి చెందిన సంతోష్ సదా (25), జియాగూడకు చెందిన పవన్(24) ఒక ముఠాగా ఏర్పడ్డారు. పాలల్లో తెలుపు రంగు పెరగడానికి, చిక్కదనం కోసం అమ్మోనియా సల్ఫేట్‌ను కలిపి.. కల్తీ పాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆగాపుర అంబేద్కర్‌నగర్‌లోని ఓ ఇంట్లో పాలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం అందుకున్న హబీబ్‌నగర్ ఎస్ఐ శివ తన బృందంతో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

