Hyderabad | పీహెచ్డీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ముగ్గురి అరెస్టు
Hyderabad | కానిస్టేబుల్ వేధింపులు భరించలేక పీహెచ్డీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ముగ్గురు నిందితులు సంగీతరావు, అనిత, ఆమె తండ్రి సోమయ్యను నాచారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కాగా, అనిత భర్త అనిల్, సైదులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Hyderabad | కానిస్టేబుల్ వేధింపులు భరించలేక పీహెచ్డీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ముగ్గురు నిందితులు సంగీతరావు, అనిత, ఆమె తండ్రి సోమయ్యను నాచారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కాగా, అనిత భర్త అనిల్, సైదులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నాచారం సరస్వతినగర్‌లో పులివర్తి దీప్తి (29) తన తల్లితో కలిసి నివసిస్తున్నది. ఎమ్మెస్సీ చదివిన దీప్తి హబ్సీగూడలోని ఐఐసీటీలో ఉద్యోగం చేస్తున్నది. ఆమె తండ్రి సంగీతరావు ఐఐసీటీలో పనిచేసి రిటైరయ్యాడు. రెండేండ్లుగా ఆయన తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. వీరి ఇంటికి సమీపంలో ఉండే డీజీపీ కార్యాలయంలో పనిచేసే కానిస్టేబుల్ అనిల్ నివసిస్తున్నాడు. అతనికి సంగీతరావుకు పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే అనిల్ భార్య అనితకు ఉద్యోగం ఇప్పిస్తానని సంగీతరావు రెండేళ్ల క్రితం రూ.15 లక్షలు తీసుకున్నాడు. పలుమార్లు అడుగడంతో రూ.7 లక్షలు ఇచ్చాడని, ఇంకా ఇవ్వాల్సిన రూ.8 లక్షలను ఇవ్వడంలేదనీ నాచారం పోలీస్‌స్టేషన్‌లో అనిల్ ఫిర్యాదు చేశాడు.
తండ్రి తీసుకున్న డబ్బులకు పోలీసులు తనను వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థిని
తండ్రితో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండకపోయినా.. డబ్బుల కోసం తననే వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న దీప్తి
హైదరాబాద్‌లోని – నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నాచారం… pic.twitter.com/xrWYDkJvGv
— Telugu Scribe (@TeluguScribe) December 27, 2024
ఈ విషయమై పోలీసులు సంగీతరావు భార్యను, ఆయన కూతురు దీప్తిని విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి దీప్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. తన తండ్రి తీసుకున్న డబ్బు విషయమై తనను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి అడగడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియోను చిత్రీకరించింది. తన మరణానికి అనిల్, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్యనే కారణమని అందులో పేర్కొన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- PhD student
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

