Cell phones | సీఈఐఆర్ విధానం ద్వారా భారీగా సెల్ ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు..
Cell phones | సీఈఐఆర్ విధానం(CEIR system) ద్వారా సనత్‌నగర్ పోలీసులు పెద్దఎత్తున సెల్ ఫోన్లు(Cell phones) రికవరీ చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి తమ సెల్ ఫోన్లు పోయాయంటూ పలువురు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
అమీర్‌పేట్, జూన్ 7 : సీఈఐఆర్ విధానం(CEIR system) ద్వారా సనత్‌నగర్ పోలీసులు పెద్దఎత్తున సెల్ ఫోన్లు(Cell phones) రికవరీ చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి తమ సెల్ ఫోన్లు పోయాయంటూ పలువురు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ ద్వారా దాదాపు 90 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. కొద్ది రోజులుగా దాదాపు 73 రికవరీ చేసిన సెల్ఫోన్లు ఫిర్యాదుదారులకు అందజేశారు. తాజాగా శుక్రవారం మరో 17 సెల్ఫోన్లను సనత్‌నగర్ పీఎస్‌లో ఇన్స్పెక్టర్ పురేందర్‌రెడ్డి, డీఐ నాగిరెడ్డితో కలిసి బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ పురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి చోరీకి గురైన సెల్ఫోన్ల ఫిర్యాదులపై సీఈఐఆర్ విధానంతో ఫోన్లను ఆయా ఐఎంఈఐ నెంబర్లపై ట్రాకింగ్ చేశామని తెలిపారు. ఎప్పటికప్పునడు రికవరీ అవుతున్న ఫోన్లను ఫిర్యాదు దారులకు అందజేస్తూ వస్తున్నామని, తాజాగా 17 సెల్ ఫోన్లను శుక్రవారం పీఎస్‌లో అందజేసినట్లు ఆయనతెలిపారు.
కాగా, చోరీకి గురైన సెల్ ఫోన్లను ట్రాకింగ్ చేయడంలో చురుగ్గా వ్యవహరించిన సనత్‌నగర్ మహిళా పీసీ గౌతమిని ఇన్స్పెక్టర్ పురేందర్‌రెడ్డి అభినందించారు.గౌతమికి రివార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఐ అరుణ్‌కుమార్, పీసీలు శేఖర్, బాలకృష్ణ, ఇబ్రహీమ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

