హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న బైక్ రైడర్స్ ఖాతరు చేయడం లేదు. తమ ఆనందం కోసం ఎదుటి వారిని ఇబ్బందులు పెడుతూ రోడ్లపైనే స్టంట్స్‌కు పాల్పడి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్(Rash driving)పై అవగాహన కల్పించి హద్దు మీరిన వారిపై కేసులు నమోదు చేస్తున్న యువకులు నిబంధనలు పట్టించుకోవడం లేదు. కాగా, రద్దీ రోడ్లపై బైక్‌లతో విన్యాసాలు చేస్తున్న ఆకతాయి యువకుల భరతం పట్టారు సైబరాబాద్ పోలీసులు. ఐటీ కారిడార్(( IT corridor )లో ర్యాష్ డ్రైవింగ్, విన్యాసాలు చేస్తున్న యువకులను అరెస్ట్ చేశారు. ఐదు బైక్‌లను పోలీసులు సీజ్ చేశారు.