Mee Seva Centers | మీ సేవ కేంద్రాలపై నీలి నీడలు.. మహిళా శక్తి కేంద్రాలకు కేటాయిస్తే కుదేలే..!
పౌర సేవలకు నెలవైన మీ సేవ కేంద్రాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పేరిట కాంట్రాక్టర్లకు బదులుగా సర్కారు బడుల్లో సివిల్ పనుల నిర్వహణ బాధ్యతలు పొదుపు సంఘాలకు కట్టబెట్టిన కాంగ్రెస్ ప్ర భుత్వం తాజాగా మీ సేవ కేంద్రాలను మహి ళా శక్తి కేంద్రాలకు కేటాయించేందుకు పావు లు కదుపుతున్న విషయం తెలిసిందే.
- డిజిటల్ సేవల ప్రభావంతో తగ్గిన మీ సేవ కేంద్రాల ప్రభ
Mee Seva Centers |జూబ్లీహిల్స్, జూన్ 30: పౌర సేవలకు నెలవైన మీ సేవ కేంద్రాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పేరిట కాంట్రాక్టర్లకు బదులుగా సర్కారు బడుల్లో సివిల్ పనుల నిర్వహణ బాధ్యతలు పొదుపు సంఘాలకు కట్టబెట్టిన కాంగ్రెస్ ప్ర భుత్వం తాజాగా మీ సేవ కేంద్రాలను మహి ళా శక్తి కేంద్రాలకు కేటాయించేందుకు పావు లు కదుపుతున్న విషయం తెలిసిందే. పౌర సేవలు డిజిటలైజేషన్ కాక ముందు, ఆధార్ కార్డులు కొత్తగా వస్తున్న సమయంలో మీ సేవ కేంద్రాల హవాయే వేరు. దీంతో ఆ కా లంలో మీ సేవ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పు ట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 4800 మీ సేవ కేంద్రాలు పనిచేస్తున్నాయి.
డిజిటల్ సేవల ప్రభావంతో స్వీయ పౌర సేవల వినియోగ విస్తృతి పెరిగి మీ సేవ కేంద్రాల ప్రభ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో నెలకు రూ.3 నుంచి 4 వేల కమీషన్ కూడా రాని కేంద్రాలే 3 వేల కు పైగా ఉన్నాయని అంచనా. దీంతో కనీసం ఇద్దరు ఆపరేటర్లతో జోడెద్దుల బండిలాగా మీ సేవ కేంద్రాలను గుంజుకొస్తున్న నిర్వాహకులకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం మూలిగే న క్క మీద తాటికాయ పడ్డ చందంగా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి కేంద్రాలకు రెండు, మూడు లక్షల రూపాయల రుణ సౌక ర్యం కల్పించి, అన్ని జిల్లాలలో 936 మీ సేవ కేంద్రాలను, గ్రేటర్లో కనీసం 150 కేంద్రాలను నెలకొల్పాలని యోచిస్తున్నట్లు సమాచారం. మీ సేవ కేంద్రాలలో ఇద్దరు ఆపరేటర్లకే జీతాలు ఇవ్వలేక కిందా మీద పడుతున్న మీ సేవ నిర్వాహకులు కొత్తగా మహిళా మీ సేవ కేంద్రాలు వస్తే తమకు వచ్చే ఆ కొద్ది క మీషన్కు గండి పడుతుందని భావిస్తున్నారు. అంతే కాక ఇది రుణ సహాయం పొంది వడ్డీ తో బ్యాంకులకు తిరిగి చెల్లించాల్సిన మహిళ ల ఆర్థిక అభ్యున్నతికి గొడ్డలిపెట్టుగా మారి వారిని మరింత అప్పుల్లోకి నెట్టేలా చేస్తున్నదని భావిస్తున్నారు.
దీంతో రెంటికి చెడ్డ రేవడిలా ఇద్దరిలో ఎవరు బాగుపడకుండా ఇద్ద రు కుదేలైపోయే పరిస్థితి నెలకొననున్నది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న మీ సేవ కేంద్రాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఎంత మా త్రం సహేతుకం కాదని మీ సేవ నిర్వాహకు లు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా సెంటర్ల ప్రతినిధు లు శనివారం బంజారాహిల్స్‌లోని ఈఎస్డీ (మీ సేవ) కమిషనర్ టి.రవి కిరణ్, ఐఎఫ్ఎస్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వినతిపత్రం కూడా ఇచ్చిన ప్రతినిధులు దీని పై పోరాటం చేయకతప్పదన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

