దమ్ము చూపేలా
ఫార్ములా ఈ- రేస్ ఉత్కంఠగా సాగుతున్నది. శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ ఆద్యంతం ఉర్రూతలూగించింది. ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీ పడ్డాయి. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాక్టీస్ మ్య
- నేడే ఫార్ములా – ఈ తుది రేసింగ్
- క్షణం క్షణం ఉత్కంఠగా సాగనున్న పోటీలు
- 11 టీంలు, 22 మంది డ్రైవర్లు..
- అందరి దృష్టి చాంపియన్ ఎవరన్న దానిపైనే
- కనువిందుగా ముగిసిన ప్రాక్టీస్-1 రేస్
- క్రికెటర్ల సందడి .. కట్టుదిట్టంగా ఏర్పాట్లు
ఫార్ములా ఈ- రేస్ ఉత్కంఠగా సాగుతున్నది. శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ ఆద్యంతం ఉర్రూతలూగించింది. ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీ పడ్డాయి. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాక్టీస్ మ్యాచ్ సాఫీగా ముగిసింది. శనివారం తుది సమరం ప్రారంభం కానున్నది. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకుపోనున్నారు. ఫైనల్ పోటీలకు భారీ సంఖ్యలో సందర్శకులు రానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 ( నమస్తే తెలంగాణ ) : అంతర్జాతీయ ఫార్ములా ఈ రేస్‌లో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్ సందర్శకుల హర్షాతిరేకాల మధ్య ఘనంగా సాగింది. విద్యుత్ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి. ట్రాక్‌పై దూసుకుపోయాయి. 11 టీంలు 22 మంది డ్రైవర్లు పాల్గొన్న ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌తో రేసర్లకు హైదరాబాద్ ట్రాక్‌పై అవగాహన ఏర్పడింది. ఆద్యాంతం ప్రీ ప్రాక్టీస్ మ్యాచ్ ఆసక్తిగా సాగింది. కాగా, నేడు అసలైన పోటీ ఉండనుంది. ప్రపంచ చాంపియన్ ఎవరు? అనేది తేలనుంది. శనివారం జరగనున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ రేస్‌కు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు.
ప్రీ ప్రాక్టీస్-1 మ్యాచ్ సాగిందిలా..
సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రీ ప్రాక్టీస్ రేసింగ్ 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రేసర్ పాస్కల్ వెహ్రెలియన్ 18వ మూలమలుపు వద్ద ప్రమాదానికి గురయ్యాడు. జర్మనీకి చెందిన ఈ రేసర్ టఘర్ పొర్చె తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రేసింగ్‌లో అతడి కారు గోడను ఢీకొట్టింది. దీంతో కొన్ని నిమిషాలు గందరగోళం నెలకొంది. కాగా అతడికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
ప్రత్యేక ఆకర్షణగా రేసింగ్ సాంగ్..
టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ ‘ఫార్ములా ఈ హైదరాబాద్‌కు వచ్చింది’ అంటూ రేసింగ్‌పై రూపొందించిన పాట శ్రోతలను ఆకట్టుకుంది. క్లాసికల్ అండ్ వెస్ట్రన్ టచ్‌తో అందరిని అలరించింది. ఈ సాంగ్‌తో ఒక మ్యూజికల్ వీడియోను కూడా చిత్రీకరించాడు. ఈ వీడియోలో హీరో సాయి ధరమ్‌తేజ్ క్యామియో అప్పిరెన్స్ ఇచ్చి స్టెప్పులు వేసి అదరగొట్టాడు.
గర్వంగా ఉంది..
ఫ్లొరియన్ మాడ్లింగర్ (పొర్షె), ఐయాన్ జేమ్స్(నియోమ్ ఎంసీలారెన్), ఫ్రెడరిక్ బెర్ట్రాండ్ (మహీంద్ర రేసింగ్)లు శుక్రవారం మీడియా గ్యాలరీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న పోటీల్లో పాల్గొనడం గర్వంగా ఉందని చెప్పారు. గెలుపు కోసం తమ టీంలు ఎంతో హార్డ్ వర్క్ చేశారని తెలిపారు. అనంతరం ప్లేయర్స్ జేక్ డెనిస్ (అవలాంచె అండ్రెట్టి), సెబాస్టియన్ (ఎన్విజన్ రేసింగ్) సామ్బర్డ్ (జాగ్వర్ టీసీఎస్ రేసింగ్)మాట్లాడుతూ.. హైదరాబాద్ ట్రాక్ మాకు కొత్త అనుభూతిని పంచుతుందని ఆశిస్తున్నట్టు వివరించారు.
ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్..
ఫార్ములా ఈ రేస్ పోటీలకు అనేక దేశాలు శాశ్వత హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. అందులో ప్రధానంగా దిరియా, మెక్సికో సిటీ, బెర్లిన్, మొనాకో, రోమ్, లండన్, జకార్తా, సియోల్ వంటి నగరాల్లో ఈ పోటీ ఏటా జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇక మీదట భారతదేశంలో నుంచి హైదరాబాద్ ఈ నగరాల జాబితాలో చేరనుందని నిర్వాహకులు వెల్లడించారు. కాగా ఫార్ములాలో మొత్తం 16 రేసులు నిర్వహిస్తారు. ఒక్కో రేస్‌లో రేసర్ పొందిన పాయింట్ల వారీగా సీజన్ల వారీ పాయింట్లు కలిపి, చివరకు ప్రపంచ చాంపియన్‌ను ప్రకటిస్తారు.
పకడ్బందీగా గ్యాలరీలు..
ఎవరికి కేటాయించిన గ్యాలరీలో వారే ఉండేలా ఏర్పాట్లు చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రూట్ మ్యాప్ ద్వారా ట్రాక్ చుట్టూ ఎక్కడ ఏ గ్యాలరీ ఉందో అర్థమయ్యేలా వెబ్సైట్లో పొందుపర్చారు. నగరం నుంచి వివిధ మార్గాల ద్వారా వచ్చే వారికి పలు చోట్ల నుంచి ఎంట్రీ గేట్లను ఏర్పాటు చేశారు.
పోటీల సందేశం ఇదే..
పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలు కాకుండా కరెంటుతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలతో రేస్ చేయడమే ‘ఫార్ములా ఈ’ రేసింగ్ ప్రత్యేకత. ఎలక్ట్రిక్ కార్ల ద్వారా సుస్థిర రవాణాను ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. భారతదేశంలో ఈ పోటీలు నిర్వహించేందుకు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు పోటీపడినా ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో ఈ ప్రతిష్టాత్మక పోటీలు హైదరాబాద్ వేదికగా జరగడం విశేషం. 2014 బీజింగ్ ఒలింపిక్స్ గ్రౌండ్ దగ్గర మొట్టమొదటి ‘ఫార్ములా ఈ’ జరిగింది. 2014లో బీజింగ్‌లో ఈ రేస్ ప్రారంభం కాగా చివరిసారి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగింది. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఆ తర్వాత దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్లోజరుగనుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

