సజావుగా పార్లమెంట్ ఓట్ల లెక్కింపు
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతతో లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి చిన్న ఘటన కూడా తావు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
- కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతతో లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి చిన్న ఘటన కూడా తావు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే మల్కాజిగిరి తోపాటు చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన కొన్ని కేంద్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆయా పార్టీల నేతలు, ఏజెంట్లు ఎన్నికల కౌంటింగ్ హాలులోకి వెళ్లారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంచారు. మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరుగగా ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎం యంత్రాలను భద్ర పరిచి, ఆయా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మంగళవారం వాటిని తెరిచి ఓట్ల లెక్కింపు నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, అవినాష్ మహంతి, తరుణ్‌జోషి ఆయా కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలించారు. కమిషనర్లు ఎప్పకటిప్పుడు ఆయా కేంద్రాల వద్ద పరిస్థితిని సమీక్షించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

